JanaSena: పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలు
JSP Issued Safety Preacausions For Pawan Kalyan Health Condition: అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యం దృష్ట్యా జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. పర్యటన సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించింది.
Pawan Kalyan Health: ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పర్యటనలో కీలక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అభిమానులు, ప్రజల తాకిడితో పవన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. దీనికితోడు పవన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులకు కొన్ని సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?
ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ 'విజయభేరి' యాత్ర చేపడుతున్నారు. ఎన్నికలు ముగిసే వరకు విరామం లేకుండా ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే పవన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రికరెంట్ ఇన్‌ఫ్లుయెంజతో బారినపడిన పవన్ తరచూ జ్వరంతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల్లో నిమ్మజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో పవన్ కల్యాణ్ బాధపడుతున్నట్లు జనసేన వెల్లడించింది. పవన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దని సూచించింది.
Also Read: AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?
కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దని జనసేన పార్టీ సూచనలు చేసింది. పూలు జల్లినప్పుడు పవన్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పవన్ పడుతున్న ఇబ్బంది నేపథ్యంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు ఈ జాగ్రత్తలు పాటించాలని జనసేన పార్టీ తన ప్రకటనలో వెల్లడించింది.
తరచూ అనారోగ్యం
జనసేనాధిపతి పవన్ కల్యాణ్ నెల రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. విజయభేరి యాత్ర ప్రారంభించినప్పటి నుంచి పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. వారం పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ వచ్చారు. విరామం తీసుకుంటూ ప్రచారం చేయాలని పవన్ భావిస్తున్నారు. పవన్ ఆరోగ్య దృష్ట్యా జనసైనికులకు, అభిమానులకు జనసేన పార్టీ పై జాగ్రత్తలు, సూచనలు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter